English | Telugu
ప్రభాస్ కోసమే సలార్ తీశారు..శృతి హాసన్ వ్యాఖ్య
Updated : Oct 27, 2023
పేరుకి తమిళ నటి అయినా కూడా తమిళంలో కాకుండా తెలుగులో ఎక్కువ సినిమా లు చేసిన నటి శృతి హాసన్. కమల్ హాసన్ కూతురిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శృతి హాసన్ తండ్రికి తగ్గ వారసురాలిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.అలాగే సింగర్ గా కూడా మంచి పేరుని సంపాదించింది .తాజాగా తను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి చెప్పిన ఒక న్యూస్ ప్రెజంట్ హాట్ టాపిక్ అయ్యింది.
శృతిహాసన్ తాజాగా సలార్ మూవీ లో నటించింది.ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆ మూవీ లో నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు ప్రయత్నించినా మేకర్స్ మాత్రం శృతి హాసన్ ని ఎంపిక చేసారు. శృతి హాసన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో సలార్ మూవీ గురించి మాట్లాడుతూ సలార్ మూవీ కేవలం ప్రభాస్ కోసం మాత్రమే తీసిన సినిమా అని అంది. ఆ తర్వాత సలార్ లో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని శృతి వ్యాఖ్యానించింది. కాగా శృతి చేసిన ఈ వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. డిసెంబర్ 22 నా విడుదల అవుతున్న సలార్ కి పోటీగా షారుఖ్ డంకి విడుదల అవుతుండటం మా సలార్ టీం కి ఎలాంటి భయం లేదని మా సినిమా మీద మాకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించింది.
అలాగే తాను హాలీవుడ్ లో చేస్తున్న ది ఐ చిత్రం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తీసిన సినిమా అని ఖచ్చితంగా ఆ సినిమా విజయం సాధిస్తుందని అంది. అలాగే తన తండ్రి కమల్ హాసన్ గురించి అడిగిన ప్రశ్నలకి కూడా శృతి సమాధానాలు ఇచ్చింది.