English | Telugu

శృతి ఇంకా అంత దిగజారలేదట !

గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్ లో శృతిహాసన్ అందాలు తెగ హాల్ చల్ చేస్తున్నాయి. రాంచరణ్ తో కలిసి నటించిన "ఎవడు" చిత్రంలోని "పింపుల్ డింపుల్..." అనే పాటలో శృతి ఓ మోస్తారు అందాలను ప్రదర్శించింది. కానీ ఈ షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో మరింత అందాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న శృతి షాక్ అయ్యానని తెలిపింది.

ఈ విషయంపై శృతి స్పందిస్తూ... మాములుగా షూటింగ్ లొకేషన్స్ లో చిత్ర బృందానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్లు రకరకాల కోణాల్లో ఫోటోలు తీస్తుంటారు. అభ్యంతకరంగా ఉన్న ఫోటోలను ఆ సినిమాకి సంబంధించినవారే తీసేస్తారు. వాటిని బయటకి వెళ్ళనీయరు. కానీ నా ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో నాకు తెలియడంలేదు. నేను ఈ విషయాన్నీ తేలికగా వదలను. పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను. వెబ్ సైట్స్ లో ఆ ఫోటోలను ఎవరు పెట్టారో తెలుసుకుంటాను. సినిమా కోసం పనిచేస్తున్న అందరిని నా కుటుంబాన్ని నమ్మినంతగా నమ్ముతాను. కానీ, నమ్మకద్రోహం చేసారు. అందుకు చాలా బాధగా ఉంది" అని అన్నారు.

పబ్లిసిటీ కోసమే ఇలా చేసారని బయట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు శృతి... "సినిమా ఎప్పుడో విడుదలై మంచి విజయం కూడా సాధించింది. ఇపుడు పబ్లిసిటీ చేసి ఏం చేసుకొని ఏం లాభం? అయినా పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారాల్సిన కర్మ తనకు లేదని" ఆవేదనతో, ఆగ్రహంతో తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఇపుడు శృతి కేసు పెట్టేది దిల్ రాజు పైనేనా? దిల్ రాజు నిర్మించిన "రామయ్య వస్తావయ్యా", "ఎవడు" చిత్రాల్లో శృతి నటించింది. కానీ ఇపుడు, ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో మరోసారి దిల్ రాజు నిర్మాణంలో శృతి నటిస్తుందా? దీనిపై దిల్ రాజు ఎలా స్పందించనున్నాడో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .