English | Telugu
గోనగన్నారెడ్డిని బంధించిన కోట గోడలు
Updated : Jul 5, 2014
ఎనర్జీ స్టార్ అల్లూ అర్జున్ రుద్రమ దేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర పోషిస్తున్న విషయం వార్తల ద్వారా తెలిసే వుంటుంది. చారిత్రక ప్రాధాన్యత వున్న పాత్రలో తొలిసారి అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఈ పాత్ర చిత్రీకరణ హైదరాబాద్‌లోని గోపనపల్లిలో మొదలైంది. ఇక్కడ తోట తరణి సారధ్యంలో వేసిన ఏడు కోట గోడల భారీ సెట్లో షూటింగ్ ఆరంభమైంది. 40 రోజుల పాటు ఏకధాటిగా ఈ సెట్ లో షూటింగ్ జరుగున్నట్లు దర్శకుడు గుణశేఖర్ ప్రకటింటారు. వందలాది జూనియర్ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్‌రాజ్, కృష్ణంరాజు, హంసానందిని కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. గోనగన్నారెడ్డిగా నటిస్తున్న అల్లు అర్జున్ కి కథానాయికగా కేథరిన్ నటిస్తోంది.