English | Telugu

18 భాషల్లో శోభిత ధూళిపాళ ‘చీకట్లో’.. ఓటీటీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!

అక్కినేని నాగచైతన్యతో 2024 డిసెంబర్‌ 4న పెళ్లి జరిగిన తర్వాత శోభిత ధూళిపాళ ఓ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఓ వినూత్న ప్రయోగం చేస్తోంది. శోభిత ప్రధాన పాత్రలో ఓ సరికొత్త వెబ్‌ మూవీని నిర్మించింది. ఈ చిత్రానికి శరత్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నారు.

‘చీకట్లో’ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చిత్రాన్ని 18 భారతీయ భాషల్లో డబ్‌ చేసి విడుదల చేయబోతున్నారు. ఓటీటీలో విడుదలైన సినిమాల్లో ఇన్ని భాషల్లో డబ్‌ అయి రిలీజ్‌ అవుతున్న మొట్ట మొదటి సినిమా ‘చీకట్లో’. అన్ని భాషలకు చెందిన మూవీ లవర్స్‌కి ఈ సినిమాని చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే 18 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. నవంబర్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ మొదలవుతుంది. అయితే స్ట్రీమింగ్‌ డేట్‌ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.