English | Telugu

బోల్డ్ సీన్స్ ఉన్నాయని బ్లాక్ బస్టర్ వదులుకున్న శివాని రాజశేఖర్!

కొత్త వాళ్ళతో మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన 'ఉప్పెన' సినిమా 2021లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంతో హీరోగా వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్ గా కృతి శెట్టి, డైరెక్టర్ గా బుచ్చిబాబు పరిచయమయ్యారు. ఈ సినిమాతో అందరికీ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి యూత్ కి బాగా దగ్గరై, వరుస సినిమా అవకాశాలను పట్టేసింది. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివాని రాజశేఖర్ కి వచ్చింది. కానీ బోల్డ్ సీన్స్ ఉన్నాయని ఆమె ఆ ఛాన్స్ వదులుకుంది.

ఉప్పెనలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని, అయితే బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఆ ఆఫర్ వదులుకోవాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివాని చెప్పింది. కథ విన్నప్పుడు కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడగలనా అనే డౌట్ వచ్చిందని, అందుకే నో చెప్పానని తెలిపింది. అయితే అప్పుడు తాను విన్న కథకి, తర్వాత రూపొందిన సినిమాకి వ్యత్యాసం ఉందని చెప్పడం విశేషం.

'అద్భుతం', 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ', 'శేఖర్‌' వంటి సినిమాల్లో నటించిన శివాని.. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'కోటబొమ్మాళి పీఎస్'లో కీలక పాత్ర పోషించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటిగా రాణిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.