English | Telugu

రూ.150 కోట్లు అంతా హంబ‌క్కేనా..??

శంక‌ర్ - విక్ర‌మ్‌ల సినిమా 'ఐ' కోసం అంతా ఆవురావుర‌మంటూ ఎదురుచూశారు. అత్యంత భారీ వ్య‌యంతో తెర‌కెక్కించిన చిత్ర‌మని ప్ర‌చారం సాగింది. ఈ సినిమా కోసం దాదాపు రెండున్న‌రేళ్లు క‌ష్ట‌ప‌డింది టీమ్ అంతా. కానీ చివ‌రికి ఏమైంది..?? సినిమా చూసిన‌వాళ్లంతా..'దీనికోసం ఇన్ని బిల్డ‌ప్పులా..' అన్న‌ట్టు పెద‌వి విరిచారు. శంక‌ర్ తీయాల్సిన సినిమాకాదంటూ ఘాటుగానే విమ‌ర్శించారు. ఎంత గొప్ప‌గా చెప్పుకొన్నారో, అంత చ‌ప్ప‌గా రిజ‌ల్ట్ వ‌చ్చింది. అయితే అంద‌రిలోనూ పీకుతున్న సందేహం ఒక్క‌టే 'ఈ మాత్రం సినిమాకి రూ.150 కోట్లు ఎక్క‌డైపోయాయి?' అనే. నిజ‌మే.. రాజ‌మౌళి ఈగ‌తో విజువ‌ల్ ఎఫెక్ట్స్ మోహ‌రించి తీసిన సినిమాకే రూ.30 కోట్లు అవ్వ‌లేదు. మ‌రి.. ఈ సినిమాకి అంతెందుకు...? భారీ ఛేజింగులు లేవు. సైకిల్ ఫైట్‌లో తీసినా, అందులో సీజీ ఎఫెక్ట్సే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ట్రైన్‌పై ఫైటింగు త‌ప్ప‌.. భారీగా ఖ‌ర్చు పెట్టిన దాఖ‌లాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయినా రూ.150 కోట్ల ఖ‌ర్చు తెర‌పై ఎవ్వ‌రికీ ఆన‌లేదు. కేవ‌లం ఈ సినిమాని మార్కెట్ చేసుకోవ‌చ్చ‌నే ఉద్దేశంతోనే భారీ బ‌డ్జెట్ చిత్ర‌మంటూ ఆర్భాటాలు చేసుండొచ్చు. అయితే పారితోషికాల విష‌యంలో అంద‌రూ భారీగా గుంజుంటార‌ని చెన్నై వ‌ర్గాల టాక్‌. శంక‌ర్ పారితోషికం ఎలాగూ చుక్కల్లోనే ఉంటుంది. దాదాపుగా రూ.30 కోట్లు అయ‌న ఖాతాలోకే వెళ్లుంటాయి. పీసీ శ్రీ‌రాం, రెహ‌మాన్ వంటి హేమాహేమీలు ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డారు. విదేశాల నుంచి స్పెష‌లిస్టుల‌ను దిగుమ‌తి చేశాడు శంక‌ర్‌. వాటికే భారీగా ఖ‌ర్చు పెట్టుంటారు. మేకింగ్ కంటే... మేక‌ర్స్ కోస‌మే ఎక్కువ బ‌డ్జెట్ అయ్యింద‌న్న‌మాట‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.