English | Telugu

ప్రముఖ నిర్మాత మృతి.. పేరునే త్యాగం చేసాడు

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్(Rajendraprasad),ఆమని(Amani)జంటగా 1993 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'మిస్టర్ పెళ్ళాం'(Mister Pellam). లెజండ్రీ దర్శకుడు బాపు(Bapu)తెరకెక్కించగా, భార్యా, భర్తల దాంపత్యం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే పాయింట్ తో నిర్మాణం జరుపుకొని మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ప్రముఖ వ్యంగ చిత్రకారుడు, కార్టూనిస్ట్ 'శంకు'(Shanku)సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతు 'మిస్టర్ పెళ్ళాం'కి నిర్మాతగా వ్యవహరించినా కూడా ఉద్యోగ నిబంధనల కారణంగా సహా నిర్మాతగా వేయించుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

78 సంవత్సరాలు గల శంకు ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో హైదరాబాద్(Hyderabad)లోని 'బాగ్ అంబర్ పేట'(Bagh Amberpet)లోని తన నివాసంలో హఠాన్మరణం చెందారు. బాపు గారి స్పూర్తితో తన 16 వ ఏట కుంచె పట్టిన శంకు ఆంధ్ర ప్రత్రికకు రెండు దశాబ్దాల పాటు బొమ్మలు, కార్టూన్లు వేశారు. ఆ తర్వాత బాపుగారి వద్ద తొమ్మిది చిత్రాలకి అసిస్టెంట్ దర్శకుడిగా పని చెయ్యడంతో పాటు, మునిమాణిక్యం వారి కాంతం కథలు, శంకరమంచి అమరావతి కథలు, వంశీ(Vamsi)మా పసలపూడి కథలు, సయ్యద్ సలీం వంటి కథల్ని దూరదర్శన్ లో ధారావాహికలుగా రూపొందించారు. నాలుగు నంది పురస్కారాలని కూడా అందుకోవడం విశేషం.

వ్యంగ చిత్రకారులని ప్రోత్సహించేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు 'క్రోక్విల్ హాస్య ప్రియ' పేరుతో ఒక మాస పత్రికని కూడా నిర్వహించారు. 2015 లో తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారంతో సన్మానించడంతో పాటు బెల్జియం దేశం చేత నాకిస్ట్ పురస్కారాన్ని అందచేసింది. శంకు భార్య పేరు శోభారాణి. దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పని చేసారు. వీరికి ఒక కొడుకు, కూతురు. సంకు భౌతిక దేహాన్ని బ్రహ్మానందం(Brahmanandam),దర్శకుడు వంశీతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శంకు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .