English | Telugu
అఫీషియల్.. సందీప్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్
Updated : Mar 3, 2023
'పుష్ప-1'తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించి సర్ ప్రైజ్ చేశాడు బన్నీ. ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కావడం విశేషం. అల్లు అర్జున్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఈరోజు టీ సిరీస్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.
అల్లు అర్జున్, సందీప్ రెడ్డి కాంబోలో సినిమా అనేది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. కేవలం ప్రకటనతోనే ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 'పుష్ప-2'లో నటిస్తున్న బన్నీ ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశముంది. అలాగే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో 'యానిమల్' మూవీ చేస్తున్న ఆ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తయ్యాక బన్నీ-సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.