English | Telugu

అప్పుడు మ‌హేష్‌.. ఇప్పుడు సంపూర్నేష్‌

పోకిరి.. టాలీవుడ్ రికార్డుల‌ను షేక్ చేసిన చిత్రం. మ‌హేష్‌బాబు స్టామినాని నిరూపించిన చిత్రం. పూరిని ద‌ర్శ‌కుడిగా టాప్ ఛెయిర్‌లో కూర్చోబెట్టిన చిత్రమిది. ఆ సినిమాకి సీక్వెల్ రావాల‌ని కోరుకోని మ‌హేష్ అభిమాని ఉండ‌డు. పూరి కూడా పోకిరి 2 సినిమా తీస్తాన‌ని చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు కూడా. ఇటీవ‌ల ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో పోకిరి రిట‌ర్న్స్ టైటిల్ ఒక‌టి రిజిస్ట‌ర్ అయ్యింది. అది మ‌హేష్ గురించేన‌ని చాలామంది భ్ర‌మ‌ప‌డ్డారు. కానీ ఇప్పుడో అస‌లు నిజం తెలిసింది. ఈ సినిమాలో హీరో మ‌హేష్ కాద‌ట‌. బ‌ర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు అట‌. సంపూ కోస‌మే నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌సత్య‌నారాయ‌ణ ఈ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు తెలుస్తోంది. రాంగోపాల్ వ‌ర్మ‌- సంపూర్నేష్‌బాబుల క‌ల‌యిక‌లో ఓ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కోస‌మే పోకిరి రిట‌ర్న్స్ అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించార‌ట‌. ఇందులో సంపూ ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తాడ‌న్న‌మాట‌. మ‌రి ఈ న‌యా పోకిరి చేసే కిరికిరి ఏమిటో తెర‌పైనే చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.