English | Telugu

హీరోయిన్ ఆదాశర్మ తండ్రి మృతి

టాలీవుడ్ లోకి ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆదాశర్మ తండ్రి గుండెపోటుతో మరణించడం ఆమెని షాక్ కి గురి చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆదాశర్మ తన తండ్రి కెప్టెన్ ఎస్.ఎల్. శర్మ తో చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా వుండేదట. అన్ని విషయాలు ఆయనతో పంచుకోనేదట. ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ అవుతున్న ఈ అమ్మడికి ఇలా తన జీవితంలోని ముఖ్య వ్యక్తిని కోల్పోవడం చాలా పెద్ద దెబ్బేనని సన్నిహితులు అంటున్నారు. ఆదాశర్మ ప్రస్తుతం త్రివిక్రమ్- అల్లుఅర్జున్ కాంబినేషన్‌లోసెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పివిపి బ్యానర్లో ఓ చిత్రం కూడా చేయనుంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.