విజయ్ కి బాలకృష్ణ భరోసా.. సీఎం పక్కానా!
ఇళయ దళపతి విజయ్(Vijay),గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna).. ఈ ఇద్దరు సౌత్ సినీ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హీరోలు. స్క్రీన్ పై కనపడితే చాలు అభిమానులు పూనకాలు వచ్చిన వాళ్ళ లాగా ఊగిపోతారు. ప్రేక్షకులకి కూడా ఈ ఇద్దరి సినీ ఛరిష్మాపై ఎంతో గౌరవం ఉంది. ప్రస్తుతం థియేటర్స్ లో అఖండ 2 తో బాలకృష్ణ సందడి చేస్తుండగా, విజయ్ ఈ నెల 9 న 'జన నాయకుడు'(Jananayakudu)తో అడుగుపెట్టబోతున్నాడు.