English | Telugu
600 మెట్లపై సమంత కర్పూర దీపాలు!
Updated : Feb 14, 2023
సమంతా రౌత్ ప్రభు. ఈమె వాస్తవానికి క్రిస్టియన్. పుట్టుకతో క్రిస్టియన్ అయిన ఈమె హిందువు అయినా నాగచైతన్య ను వివాహం చేసుకుంది. వీరి వివాహం కూడా హిందూ క్రైస్తవ సాంప్రదాయాలలో జరిగాయి. అంతేగాని సమంత హిందుత్వం పుచ్చుకున్నట్టు ఎక్కడ వార్తలు రాలేదు. అలాగే నాగచైతన్య కూడా సమంత కోసం మతం మార్చుకోలేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయారు. విడిపోయిన తరువాత సమంత పలు సమస్యలను ఎదుర్కొంటుంది.
ప్రేమించి పెళ్లాడిన నాగచైతన్యతో విడిపోవడం మయూసైటిస్ వ్యాధి రావడంతో ఆమె జీవితం కాస్త అల్లకల్లోలానికి గురైంది. తాజాగా ఆమె మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుంటుంది. ప్రస్తుతం తనతో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తీసిన దర్శకద్వయం రాజ్ అండ్ డీకే లతో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ముంబై టు హైదరాబాద్ ప్రయాణం చేస్తుంది. తెలుగులో ఖుషి సినిమాలో పాల్గొనాల్సి ఉంది. ఈమె హైదరాబాద్‌కు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తోంది.
తాజాగా ఈమె పళనిలోని మురుగన్ ఆలయాన్ని సందర్శించింది. ఆలయంలోని 600 మెట్లపై కర్పూరం వెలిగించి మొక్కు తీర్చుకుంది. పళని మురుగన్ ఆలయంలో సమంత మొక్కు తీర్చుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న మొన్నటి వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత ఇలా 600 మెట్లపై కర్పూరం వెలిగించి మొక్కు తీర్చుకోవడం మామూలు విషయం కాదు. సమంతాతో పాటు ఆమె స్నేహితులు పలని మురుగన్ ఆలయంలో సందడి చేశారు. ఆశ్చర్యకరంగా జానూ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ కూడా సమంతతో ఉన్నాడు. స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని స్థానిక మీడియాతో సమంతా చెప్పుకొచ్చింది. మయోసైటీస్ నుంచి ఈమె పూర్తిగా కోలు కున్నట్టే కనిపిస్తోంది. అన్ని కార్యక్రమాల్లో రెగ్యులర్‌గా ఉంటుంది. దాంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నటించిన శాకుంతల చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ఏప్రిల్‌కి వాయిదా పడింది.