English | Telugu

హీలింగ్ జ‌ర్నీని మొదలుపెట్టిన సామ్‌

జులై 13 త‌న కెరీర్‌లో అత్యంత కీల‌క‌మైన రోజు అని ప్ర‌క‌టించారు సామ్‌. ఆ త‌ర్వాతి రోజు నుంచి ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. త‌న విశ్రాంత‌ప‌ర్వం గురించి తొలి సారి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో బ‌ట్టి, ఆమె ప్ర‌స్తుతం ఈషా యోగా సెంట‌ర్ నుంచి త‌న హీలింగ్ జ‌ర్నీని మొద‌లుపెట్టిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. స‌మంత సినీ కెరీర్‌కి మాత్ర‌మే బ్రేక్ ఇచ్చారు, సోష‌ల్ మీడియాకు కాదు అన్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌న అభిమానుల‌కు త‌న జ‌ర్నీ నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ ఇస్తార‌నే విష‌యం దీన్ని బ‌ట్టి తెలుస్తోంది. స‌మంత హీలింగ్ జ‌ర్నీని మొద‌లుపెడుతున్న‌ట్టు ఆమె హెయిర్ స్టైలిస్ట్, ఫ్రెండ్ రోహిత్ భ‌ట్క‌ర్ అనౌన్స్ చేశారు. ఆమెతో క‌లిసి ప‌నిచేసిన రోజుల‌ను గుర్తుచేసుకున్నారు. ఆమె హీలింగ్ జ‌ర్నీని పూర్తి చేసుకుని తిరిగి వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేస్తామ‌ని కూడా అన్నారు. ప్ర‌స్తుతం సామ్ స‌ద్గురు ఈషా సెంట‌ర్‌లో ఉన్నారు. అక్క‌డి నుంచి డే టు డే యాక్టివిటీస్‌ని పోస్ట్ చేయాల‌ని రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

నీలి రంగు ఆకాశం, మేఘాలు, హ‌రివిల్లు ఉన్న ఫొటో షేర్ చేశారు స‌మంత‌. ప్ర‌పంచంలో అత్య‌ద్భుత‌మైన‌వ‌న్నీ ఉచితంగానే లభిస్తాయ‌ని క్యాప్ష‌న్ పెట్టారు. దీనికి ముందు ఆమె రోడ్ ట్రిప్ వెళ్లారు. వేలూరులోని ల‌క్ష్మీనారాయ‌ణి గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అక్క‌డి నుంచి ఇప్పుడు ఈషా సెంట‌ర్‌లో సేద దీరుతున్నారు. య‌శోద సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌మ‌యం నుంచి ఆమె మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆ బాధలో ఉన్న‌ప్ప‌టికీ క‌మిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేశారు. నెక్స్ట్ హాలీవుడ్ సినిమా ఎంట్రీ ఇస్తారని అనుకుంటుండ‌గానే, బ్రేక్ తీసుకుంటార‌నే వార్త వ‌చ్చింది. చికిత్స కోసం అమెరికా వెళ్ల‌నున్నారు స‌మంత‌. అక్క‌డికి వెళ్ల‌డానికి ముందు ఇక్క‌డ త‌న‌కు న‌చ్చిన ప్ర‌దేశాల‌లో కొన్నాళ్లు ఉండి వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ట‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.