English | Telugu

'శాకుంతలం' పరాజయం.. సమంత గీతోపదేశం!

సమంత టైటిల్ రోల్ పోషించిన పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం' ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 విడుదలై మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిన ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ ని రాబట్టలేక సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సమంత పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

'శాకుంతలం' సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆ మరుసటి రోజు నుంచి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేసిన సమంత.. 'ఫలితం మన చేతుల్లో ఉండదు' అంటూ 'శాకుంతలం' ఫలితం గురించి పరోక్షంగా స్పందిస్తూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని రాసుకొచ్చింది. "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.. మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి" అనే శ్లోకాన్ని సమంత పోస్ట్ చేసింది. "పని చేయడం వరకే నీకు అధికారం. దాని ఫలితంతో నీకు సంబంధం లేదు. కనుక ప్రతిఫలం ఆశించి పని చేయకు. అలా అని పని చేయడం మానకు" అనేది ఆ శ్లోకం అర్థం. మొత్తానికి "పని చేయడం వరకే మా చేతిలో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో ఉండదు" అని 'శాకుంతలం' ఫలితం గురించి పరోక్షంగా స్పందించింది సమంత.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.