English | Telugu
కాజల్‌కి అన్యాయం చేసిన పవన్, త్రివిక్రమ్?
Updated : Aug 20, 2015
పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ ఇద్దరూ మంచి దోస్తులు. ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాకపోతే.. వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు చేసుకొనే త్యాగాలే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాయి. లేటెస్టుగా త్రివిక్రమ్ కోసం పవన్ ఓ త్యాగం చేసేశాడు. తన సినిమాలో హీరోయిన్ ని మార్చేశాడు.
విషయం ఏంటంటే... పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా సర్దార్ - గబ్బర్ సింగ్‌లో కథానాయికగా కాజల్‌ని ఎంచుకొన్నారు. అయితే.. ఇప్పుడు ఆ స్థానం మారింది. కాజల్ ప్లేసులో సమంత వచ్చింది. దీనంతటికీ కారణం త్రివిక్రమ్ అని టాక్. కేవలం త్రివిక్రమ్ రికమెండ్ చేయడం వల్లే.. కాజల్‌ని పవన్ పక్కన పెట్టాడని, ఆ స్థానంలో సమంతని తీసుకొన్నాడని చెప్పుకొంటున్నారు. సమంతకు త్రివిక్రమ్ ఓ మెంటర్‌లా, గైడ్‌లా వ్యవహరిస్తున్నాడని, ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనే సమంత పయనిస్తోందని.. టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ తాజా చిత్రంలోనూ సమంతనే కథానాయిగా తీసుకొన్నారట. అలా సమంతని మళ్లీ నెంబర్ వన్‌గా నిలబెట్టేందుకు త్రివిక్రమ్ కంకణం కట్టుకొన్నాడని చెప్పుకొంటున్నారు. మొత్తానికి వీళ్లంతా కలసి కాజల్‌కి అన్యాయం చేశారు.