English | Telugu

నేను ఆ సినిమా చూడలేదు: సమంత


‘నేను ఇంకా ఆ సినిమా చూడలేదు, కానీ అందరూ ఆ సినిమా చాలా బాగుంది అంటున్నారు. అటువంటి సినిమాలు మరెన్నో రావాలి అంటున్నారు’ అంటూ ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంపై స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రశంసల వర్షం కురిపించేస్తోంది. సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో శ్రీని అవసరాల తెరకెక్కించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం సమంతను సైతం ఆకట్టుకొంది. సాయి కొర్రపాటి ఇంతకుమునుపు సమంతతో ‘ఈగ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ సినిమాకి అభినందనలు తెలిపిన సమంతకు సాయి కొర్రపాటి కృతజ్ఞతలు తెలిపారు!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.