English | Telugu
పవన్ కళ్యాణ్ సరసన 'ఏజెంట్' బ్యూటీ!
Updated : Jun 21, 2023
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా 'ఏజెంట్' బ్యూటీ సాక్షి వైద్య ఎంపికైనట్లు తెలుస్తోంది.
అక్కినేని అఖిల్ హీరోగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఏజెంట్' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది సాక్షి వైద్య. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఏజెంట్ ఘోర పరాజయం పాలైనప్పటికీ.. సాక్షి వైద్యకు ఏకంగా పవన్ సినిమాలో నటించే అవకాశం దక్కినట్లు సమాచారం. అసలే 'ధమాకా' బ్యూటీ శ్రీలీల రూపంలో ఉస్తాద్ కి ప్రత్యేక ఆకర్షణ ఉండగా, ఇప్పుడు సాక్షి వైద్య రాక మరింత గ్లామర్ తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు.
'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 'గబ్బర్ సింగ్' తరహాలో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.