English | Telugu
ఆస్కార్ బరిలో ఆర్.పి.పట్నాయక్!
Updated : Sep 27, 2023
తెలుగు సినిమా సంగీతం బతికున్నంత కాలం కొన్ని సినిమా పాటలు సజీవంగా ప్రేక్షకుల గుండెల్లో కొలువుతీరి ఉంటాయి. అలాగే ఎన్ని సంవత్సరాలు దాటినా ఆ పాటలకి బాణీలని అందించిన సంగీత దర్శకులు కూడా ప్రేక్షకుల గుండెల్లో నిరంతరం చిరస్మనీయులు గానే ఉంటారు.అలాంటి ఎంతోమంది సంగీత దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు.కానీ ఒక సంగీత దర్శకుడు మాత్రం తన సంగీతంతో ప్రేక్షకులని అలరించడమే కాకుండా ఎన్నో అద్భుతమైన సినిమా లకి దర్శకత్వం వహించడం తో పాటు నటుడిగా కూడా రాణించాడు .ఇప్పుడు ఆయన హాలీవుడ్ లో రూపొందించిన ఒక షార్ట్ ఫిలిం ఆస్కార్ బరిలో నిలబడటానికి అర్హత పొంది తెలుగు వాళ్లందరికీ చాలా గర్వంగా ఫీలయ్యేలా చేసాడు.
ఆర్.పి పట్నాయక్ ..ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశోయోక్తి కాదు. నీకోసం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన పట్నాయక్ నీకోసమే తెలుగు సినీ పరిశ్రమ ఎదురుచూస్తుందనేలా తన సంగీతంతో ఎన్నో అత్యద్భుతమైన పాటలని ప్రేక్షకులకి అందించాడు.అలాగే ఫోక్ సాంగ్స్ ల్లో కూడా ఆయన మంచి పేరుని సంపాదించాడు. అందుకు ఉదాహరణగా నువ్వు నేను సినిమాలోని గాజువాక పిల్ల అనే పాట,జయం సినిమాలోని రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో అనే పాట,అలాగే ఫ్యామిలీ సర్కస్ సినిమా లోని నన్ను తిట్టకరో కొట్టకరో మావ సుబ్బులు మావ అనే పాటలే ఉదాహరణ. ఈ పాటలు నిత్యం ఎక్కడో ఒక చోట మోగుతూనే ఉంటాయి.అలాగే మెలోడీ సాంగ్స్ ,లవ్ సాంగ్స్ కి కూడా ఆయన ఒక రేంజ్ లో బాణీలు సమకూరుస్తారు. ఆయా పాటలు కూడా నేటికీ చాలా మంది సెల్ రింగ్ టోన్స్ గా ఉన్నాయి.
అసలు విషయానికి వస్తే సంగీత దర్శకుడు గానే కాకుండా దర్శకత్వ శాఖ లో కూడా పట్నాయక్ తన ప్రతిభని చాటారు.బ్రోకర్ ,అందమైన మనసు,తులసిదళం లాంటి పలు విభిన్న చిత్రాలని ప్రేక్షకులకి అందించాడు.అలాగే నటుడు గా కూడా శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమా లో గుడ్డి వాడి పాత్రలో నటించి వెండితెరపై తన సత్తాని చాటాడు. లేటెస్టుగా పట్నాయక్ ఒక రికార్డు ని సొంతం చేసుకున్నాడు.ఆయన హాలీవుడ్ లో రూపొందించిన ట్రిగ్గర్ అనే షార్ట్ ఫిలిం ప్రపంచ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ బరిలో నిలవడానికి అర్హత సంపాదించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్నాయక్ తన సంతోషాన్ని తెలియ చెయ్యడం తో పాటు తనకి మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియచేసాడు.అలాగే ట్రిగ్గర్ ని ఆస్కార్ బరిలోకి పంపేలా చేసిన షార్ట్ ఫిలిం నిర్మాతలకి ,సాంకేతిక నిపుణలకి కూడా పట్నాయక్ ధన్యవాదాలు తెలిపాడు.