English | Telugu

‘మిమ్మల్ని పవన్‌ భార్యగానే చూస్తాం..’ అభిమాని చేసిన కామెంట్‌పై రేణు రియాక్షన్‌ ఇదే!

రేణు దేశాయ్‌.. ‘బద్రి’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే పవన్‌కళ్యాణ్‌తో ప్రేమలో పడ్డారు. 2009లో వీరిద్దరూ వివాహం చేసుకొని కొన్ని కారణాల వల్ల 2012లో విడిపోయారు. ఆ తర్వాత మరో వివాహం చేసుకోకుండా తన ఇద్దరు పిల్లలు అకీరానందన్‌, ఆద్యలను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు.. అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతుంటారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, వారి కామెంట్లకు స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఓ అభిమాని ‘మేం మిమ్మల్ని ఇంకా పవన్‌ కళ్యాణ్‌ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో వేరొక మగాడిని ఊహించలేం’ అని కామెంట్‌ చేశాడు.

అభిమాని చేసిన కామెంట్‌పై తనదైన శైలిలో స్పందించారు రేణు దేశాయ్‌. ‘ఈ వ్యక్తి సోషల్‌ మీడియాలో చదివి తెలుసుకొని ఇలా కామెంట్‌ చేస్తున్నాడనుకుంటున్నాను. మనం 2025లో ఉన్నప్పటికీ మహిళ భర్త లేదా తండ్రి ఆస్తిగానే భావించే ధోరణి పురుషుల్లో ఇంకా ఉంది. మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వారి అనుమతి కోరుకోవడం తప్పు. మహిళలు వంటగదికి మాత్రమే పరిమితం కావాలని, పిల్లల్ని పెంచి పెద్ద చేసే మనిషిగానే ఉండాలని కోరుకునే మగవారు ఇప్పటికీ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా నా వాయిస్‌ వినిపిస్తాను. నా ధోరణి పట్ల నా ఫాలోవర్స్‌ ఏమనుకుంటారనే దాని గురించి నేను భయపడను. రాబోయే తరాల మహిళల్లో మార్పు తీసుకు రావడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ఫెమినిజం అంటే వీకెండ్‌లో తాగి తిరగడం కాదు. ఆడవారిని పశువులుగా, ఫర్నిచర్‌లా చూసే మైండ్‌సెట్‌ను ప్రశ్నించడమే నిజమైన ఫెమినిజం’ అంటూ రేణూ తన పోస్ట్‌తోపాటు ఆ ఫ్యాన్‌ చేసిన కామెంట్‌ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్‌ చేశారు. ఈ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాన్ని ఎంతో ధైర్యంగా చెప్పిన రేణు దేశాయ్‌ను అభినందిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.