English | Telugu

‘గోపాల గోపాల’పై రేణు కామెంట్స్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గురించి ఏవో కొన్ని మంచి విషయాలు చెబుతూ... పవన్ అభిమానుల నుంచి మంచి మార్కులు కొట్టేస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. పవర్ స్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రేణు దేశాయ్ కూడా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి పవన్ కళ్యాణ్ మళ్లీ పొగిడేసింది. ‘గోపాల గోపాల’ పోస్టర్ చూశాను. సరైన వ్యక్తికి సరైన పోస్టర్ గా వుంది. ఆయన మాత్రమే అంత నిర్మలంగా, దైవత్వంతో కనపడగలరు’ అంటూ పవన్ ని ఆకాశానికి ఎత్తేసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.