English | Telugu

'పటాస్' టీజర్ పేలింది

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'పటాస్' టీజర్ రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఈ టీజర్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఫన్, రొమాంటిక్, ఎంటర్ టైన్ మెంట్ బాగా మిక్స్ చేసినట్లు టీజర్ చెబుతోంది. సాయి కార్తీక్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ నెలలోనే చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతవరకు కళ్యాణ్ రామ్ తనకు నటన పరంగా పేరు తెచ్చేవి, కాస్త వైవిధ్య వున్న కథాంశాలు ఎన్నుకున్నాడు. కానీ ఈసారి రొటీన్ మాస్ మసాలా ట్రాక్ లో వెళుతున్నట్లు కనిపిస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.