English | Telugu

రాజకీయాల్లోకి తండ్రి... సినిమాల్లోకి కొడుకు!

నో, నో మా అబ్బాయి ఇప్పుడ‌ప్పుడే సినిమాల్లోకి రాడు. అయినా అత‌నికి డైర‌క్ష‌న్ మీద ఇంట్ర‌స్ట్ ఉంది. అత‌న్ని హీరోగా ప‌రిచయం చేయ‌డం గురించి మేం ఇంకా నిర్ణ‌యానికి రాలేదు అని గ‌తేడాది చెప్పారు విజ‌య్‌. అయితే ఇప్పుడు ఆ మాట‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది అంటున్నారు కోలీవుడ్ విమ‌ర్శ‌కులు. విజ‌య్ త‌న‌యుడు జేస‌న్ సంజ‌య్ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి వ‌స్తార‌ని చెబుతున్నారు. జేస‌న్ సంజ‌య్ హీరోగా న‌టించే సినిమాలో దేవ‌యాని కుమార్తె ఇన‌య హీరోయిన్‌గా చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇనియా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యారు. అజిత్ కుమార్‌, పార్తిబ‌న్‌, దేవ‌యాని న‌టించిన నీ వ‌రువాయ‌న సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుంద‌నే మాట‌లు త‌మిళ‌నాడులో వైర‌ల్ అవుతున్నాయి. దేవ‌యాని భ‌ర్త 1991లో తెర‌కెక్కించిన సినిమా నీ వ‌రువాయ‌న‌. ఇప్పుడు సీక్వెల్ కూడా ఆయ‌నే తెర‌కెక్కిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది.

ప్ర‌స్తుతం జేస‌న్ సంజ‌య్ కెన‌డాలోని ఓ యూనివ‌ర్శిటీలో చ‌దువుతున్నారు. ఇనియా కూడా డిగ్రీ చ‌దువుతున్నారు. సినిమాల ప‌ట్ల ఇద్ద‌రికీ ఆస‌క్తి ఉంది. ఆల్రెడీ జేస‌న్ సంజ‌య్‌ని దృష్టిలో పెట్టుకుని ప‌లువురు ద‌ర్శ‌కులు క‌థ‌లు సిద్ధం చేసుకున్నార‌ట‌. ఆ వ‌రుస‌లో డైర‌క్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా ఉన్నార‌నే వార్త‌లు వినిపించాయి. విజ‌య్ త‌నయుడిని లోకేష్ క‌న‌గ‌రాజ్ డైర‌క్ట్ చేస్తార‌నే వార్త‌లు కూడా ఆ మ‌ధ్య జోరుగా వినిపించాయి. ఇప్పుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ డైర‌క్ష‌న్‌లో లియో మూవీ చేస్తున్నారు విజ‌య్‌. ఇటీవ‌ల షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. కొడుకు ఎంట్రీ గురించి విజ‌య్ అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించే వ‌ర‌కు ఇలాంటి వార్త‌లు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి.