English | Telugu
అదరగొట్టిన రవితేజ పవర్ లుక్
Updated : Jan 23, 2014
మాస్ మహారాజా రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "పవర్" అనే టైటిల్ ను ఖరారు చేసారు. "అన్ లిమిటెడ్" అనేది క్యాప్షన్. జనవరి 26 రవితేజ పుట్టినరోజు. తన పుట్టినరోజు కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రెండు రోజులు ముందుగానే విడుదల చేసారు. "విక్రమార్కుడు" చిత్రంలో పోలీస్ గెటప్ లో కనిపించి అలరించిన రవితేజ.. మరోసారి ఇందులో మాస్ పోలీసోడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఫస్ట్ లుక్ ను చూస్తే "పవర్" సినిమా అదిరిపోయే కమర్షియల్ ఎంటర్ టైనర్ అవుతుందని అనిపించేలా ఉంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.