English | Telugu
రవితేజ హిందీ సినిమా టైటిల్...?
Updated : Aug 1, 2013
"బలుపు" చిత్రం తర్వాత రవితేజ చాలా సైలెంట్ అయిపోయాడు. సినిమా షూటింగ్ సమయంలోనే రెండు, మూడు సినిమాలను ఒప్పెసుకునే రవితేజ.. "బలుపు" విజయం తర్వాత ఏ దర్శకుడితో చేస్తాడనే విషయాలపై ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం... సమీర్ కార్నిక్ అనే బాలీవుడ్ దర్శకుడితో రవితేజ తన కొత్త చిత్రం చేయనున్నాడని తెలిసింది. సమీర్ కార్నిక్ ఇటీవలే "బలుపు" చిత్రం చూసి, అందులోని రవితేజ నటన, కామెడీ నచ్చేయడంతో... రవితేజ కోసం ఓ కామెడీ ఎంటర్టైనర్ కథను రెడీ చేసుకొని వచ్చి, రవితేజకు వినిపించాడంట. ఈ కథ బాగా నచ్చి రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలిసింది. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి హిందీలో "కౌర్ అండ్ సింగ్" అని, తెలుగులో "లక్ష్మీరెడ్డి" అనే టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మరి ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.