English | Telugu
రవితేజతో కళ్యాణ్ రామ్ డబుల్ కిక్
Updated : Jan 3, 2014
రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన "కిక్" చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నటుడు కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానరైన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించనున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "అతనొక్కడే" చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు సురేందర్. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్లే ఈ సీక్వెల్ ను కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "రేసుగుర్రం" అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.