English | Telugu
రక్తపు మరకలతో విజయ్... చుట్టూ పోలీసులు!
Updated : Sep 11, 2023
మిగిలిన వాళ్ల సంగతి ఏమోగానీ విజయ్ సేతుపతి మాత్రం 2023ని అస్సలు మర్చిపోరు. అంతగా కలిసొచ్చింది ఈ ఏడాది ఆయనకు. షాహిద్ కపూర్ నటించిన వెబ్ సీరీస్ ఫర్జిలో కీలక పాత్రలో నటించారు హీరో విజయ్ సేతుపతి. ఈ వెబ్ సీరీస్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ వెబ్ సీరీస్ సంగతి అటు ఉంచితే, ఈ ఏడాది ఆయన నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. ఇంకో సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది. అదే ఆయన బాలీవుడ్‌లో నటించిన మెర్రీ క్రిస్‌మస్. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లలోనే 50 సినిమాలకు చేరువైన నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఆయన నటించిన వీజేయస్50వ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆయన నటించిన వీజేయస్50 సినిమాకు మహారాజా అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమాను నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో సాగుతుంది.
ఈ సినిమా గురించి విజయ్ సేతుపతి తన అఫిషియల్ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. బార్బర్ సీట్‌లో గాయాలతో కూర్చుని ఉన్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వయొలెన్స్ కా బాప్ అన్నట్టుంది పోస్టర్. ఆయన మెడ వెనుక ఉన్న బ్యాండేజ్, కుర్చీ లెగ్‌లో ఉన్న బ్లడ్, ఆ వెనుక పోలీసులు, విరిగిన గోడలో నుంచి వాళ్లు ఈ దృశ్యాన్ని చూడటం వంటివన్నీ ఫ్యాన్స్ కి ఫస్ట్ లుక్‌లో నచ్చేశాయి.
ఈ సినిమాకు రైటర్ కూడా నితిలన్. సుధాన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో కీ రోల్ చేశారు. విజయ్ సేతుపతి గత చిత్రాల్లాగనే మహారాజా కూడా పెద్ద హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేసింది ఫస్ట్ లుక్ పోస్టర్.