English | Telugu
డైరెక్టర్ చిన్నప్పుడు జరిగిన ఘటనలే 'రామారావు' క్యారెక్టర్‌ను సృష్టించాయి!
Updated : Jul 13, 2021
మాస్ మహారాజా రవితేజ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి 'ఖిలాడి' కాగా.. మరొకటి 'రామారావు ఆన్ డ్యూటీ'. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఖిలాడి'లో రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు రవితేజ. అయితే, ఆ పాత్రలకు సంబంధించి ఇప్పటివరకు సరైన స్పష్టత రాలేదు.
కాగా, శరత్ మండవ రూపొందిస్తున్న 'రామారావు'లో మాత్రం మాస్ మహారాజా డిస్ట్రిక్ట్ సబ్-కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాదు.. 1995 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పోషిస్తున్న సబ్-కలెక్టర్ క్యారెక్టర్.. ట్రెడీషనల్ గా, కన్వెన్షనల్ గా కాకుండా సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని శరత్ చెప్పుకొస్తున్నారు.
అంతేకాదు.. దర్శకుడు శరత్ చిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా 'రామారావు' తెరకెక్కుతోందట. మొత్తమ్మీద.. 'క్రాక్' తరువాత మరోసారి వాస్తవ ఘటనలతో రూపొందుతున్న సినిమాతో రవితేజ పలకరించనున్నారన్నమాట. మరి.. 'క్రాక్' లాగే 'రామారావు' కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో 'రామారావు ఆన్ డ్యూటీ' తెరపైకి రానుంది.