English | Telugu
సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతలకే పూర్తి హక్కులు.. డబ్బే ముఖ్యం
Updated : Jul 13, 2021
కరోనా కాలంలో థియేటర్స్ మూతపడటంతో పలు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఒకవేళ థియేటర్స్ రీఓపెన్ అయినా ఇప్పటికిప్పుడు ప్రేక్షుకులు మునుపటిలా థియేటర్స్ కు వచ్చే అవకాశం లేకపోవడంతో.. నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికే మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ హీరోగా నటించిన 'నారప్ప' ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు.. థియేటర్స్ లోనే నేరుగా సినిమాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు.
కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలకే తమ సినిమాలపై పూర్తి హక్కులు ఉంటాయని.. ఎక్కడ విడుదల చేయాలనేది నిర్మాత ఇష్టమని సురేష్ బాబు వ్యాఖ్యానించారు. సినిమా బిజినెస్ లో తప్పు, ఒప్పులు చూడటం సమంజసం కాదని.. ఇండస్ట్రీలో లాభనష్టాలు ఉంటాయని.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పని చేస్తారని అన్నారు. కరోనా సమయంలో ఎగ్జిబిటర్లు మాత్రమే కాకుండా నిర్మాతలు కూడా నష్టపోయారనే విషయాన్ని గుర్తుచేసారు. అలాంటి సమయంలో మంచి రేటు వచ్చినప్పుడు సినిమాను ఓటీటీలో విడుదల చేయడం తప్పేం కాదని.. వారికి ఇష్టమైన ప్లాట్ ఫామ్ లో విడుదల చేసుకునే హక్కు నిర్మాతలకు ఉందని సురేష్ బాబు అన్నారు.
ప్రస్తుతం సురేష్ బాబు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన మాటలను సమర్థిస్తుండగా.. మరికొందరు థియేటర్స్ లోనే సినిమాలను విడుదల చేయాలని అంటున్నారు.