English | Telugu
మాస్ రాజా వారసుడు వస్తున్నాడు!
Updated : Mar 23, 2023
మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. ఆయన సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి 'పెళ్లి సందడి' ఫేమ్ గౌరి రోనంకి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
మహారాజా సోదరుడి కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం గురువారం నాడు లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్ కి రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానుందని దర్శకనిర్మాతలు తెలిపారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రామ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ గా కిరణ్ కుమార్ వ్యవహరించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.