English | Telugu

రంగుల్లో హాయ్ అంటున్న ర‌ష్మిక‌

ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు బిజియెస్ట్ స్టార్‌. దేశంలో ఎన్ని భాష‌లున్నాయో, అన్నిట్లోనూ సినిమాలు సంత‌కం చేసినా నేనేం బిజీగా ఉన్నాన‌ని అనుకోను అని బోల్డ్ గా స్టేట్‌మెంట్ ఇచ్చే మ‌న‌స్త‌త్వం నేష‌న‌ల్ క్ర‌ష్‌ది. ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు అమితాబ్ బ‌చ్చ‌న్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, విజ‌య్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కార్తితో పాటు ఇంకా ప‌లువురితో ప‌నిచేసిన ఎక్స్ పీరియ‌న్స్ ఉంది. ప్ర‌స్తుతం ఆమె దేవ్ మోహ‌న్‌తో రెయిన్‌బోలో న‌టిస్తున్నారు. యాక్చువ‌ల్‌గా ఈ సినిమాలో స‌మంత న‌టించాల్సింది. కార‌ణాలు ఏంటో తెలియ‌దు గానీ, ఆమె ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. సీన్‌లోకి ర‌ష్మిక వ‌చ్చారు. అయినా ఏ మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా, ర‌ష్మిక‌కు కంగ్రాజులేష‌న్స్ చెప్పారు స‌మంత‌. ఫీమేల్ సెంట్రిక్ సినిమా ఇది.

శాంత‌రూబ‌న్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జ‌రుగుతోంది. షూటింగ్ నుంచి ఓ పిక్ షేర్ చేశారు ర‌ష్మిక‌. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె షేర్ చేసిన పిక్ అభిమానుల‌కు నూత‌నోత్తేజాన్నిస్తోంది. ఈ సినిమాతో పాటు ర‌ష్మిక యానిమ‌ల్ షూటింగ్‌లోనూ సైమ‌ల్‌టైనియ‌స్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ఆమె న‌టిస్తున్న తొలి సినిమా యానిమ‌ల్‌. సందీప్ రెడ్డి వంగాకి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అర్జున్‌రెడ్డి త‌ర్వాత త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన స‌బ్జెక్ట్. ఫ‌స్ట్ మూవీ అర్జున్ రెడ్డిని ఇక్క‌డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తీస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. నార్త్ లో షాహిద్ క‌పూర్‌తో క‌బీర్‌సింగ్‌గా తీస్తే, వేరే రేంజ్‌లో ఆడింది. ఇప్పుడు యానిమ‌ల్ అత‌నికి చాలా ప్రెస్టీజియ‌స్‌. పుష్ప‌2 కూడా ర‌ష్మిక‌కు ఇంపార్టెంట్ సినిమా. ఇందులో పుష్ప‌రాజ్ భార్య‌గా కీ రోల్ చేస్తున్నారు ర‌ష్మిక మంద‌న్న‌. పుష్ప జైల్లో ఉంటే, బ‌య‌ట అత‌ని కార్య‌క‌లాపాల‌న్నీ చూసే శ్రీవ‌ల్లిగా క‌నిపిస్తారు ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సినిమాలో ఫాహ‌ద్ ఫాజిల్‌తోనూ ర‌ష్మిక‌కు మంచి సీన్లుంటాయ‌ట‌. రీసెంట్‌గా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ సినిమా కూడా స్టార్ట్ అయింది నేష‌న‌ల్ క్ర‌ష్‌కి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.