English | Telugu
రోషన్ కనకాల మీద నాని కామెంట్స్ వైరల్!
Updated : Oct 10, 2023
సుమ-రాజీవ్ కనకాల కొడుకు రోషన్ 'బబుల్ గమ్' అనే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంటుకి గెస్ట్ గా వచ్చిన హీరో నాని సుమ గురించి కామెంట్స్ చేశారు. " ఎవరైనా ఒక కెమెరాను సుమ ఫేస్ మీద ఫోకస్ పెట్టారా..ఎందుకంటే రోషన్ మాట్లాడుతున్నప్పుడు సుమ ముఖం చూశాను .. బల్బులా వెలిగిపోతోంది. ఇన్ని ఫంక్షన్స్ చేశారు కానీ సుమని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు ... సాధారణంగా ఎవరికైనా స్టేజ్ అంటే భయం ఉంటుంది. స్టేజ్ పైనే పెరిగినట్టున్నాడు రోషన్ అందుకే అలాంటి భయమేమీ మాట్లాడేటప్పుడు కనిపించలేదు. రోషన్ కి ఎంటైర్ ఫీల్ ఇండస్ట్రీ, ఎంటైర్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది... ఫస్టు మూవీలో ఎవరైనా కాస్త తడబడటం అంటూ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా రోషన్ సాలీడ్ గా చేశాడు. నాకైతే ఒక్క ఫాల్స్ నోట్ కూడా కనిపించలేదు. తనని చూస్తుంటే మరో సక్సెస్ ఫుల్ హీరో ఇండస్ట్రీకి వచ్చినట్టే అనిపిస్తోంది. మానసతో రోషన్ కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యింది. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది... తప్పకుండా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
ఇక 'బబుల్ గమ్' మూవీని రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేసాడు. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' వంటి మూవీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన కొడుకు రోషన్ గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ "మా అబ్బాయిని, ఈ టీజర్ ను ఇంత గ్రాండ్ గా లాంచ్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఇప్పటివరకు రాజీవ్ కనకాల అని పిలువగానే కనకాల వినబడింది కదా అని స్టేజి మీదికి పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడిని. ఇప్పుడు రోషన్ కనకాల అని పిలువగానే నన్నే పిలుస్తున్నారేమో అని లేచాను. కానీ ఆ తర్వాత నన్ను కాదులే అని కూర్చుండిపోయా. రోషన్ కీప్ ఇట్ అప్. చాలా బాగా చేశావు. టీజర్ లో చూసి నువ్వు ఇంకా బాగా చేసి ఉంటావని అనుకుంటున్నాను. " అని చిన్న నవ్వేసాడు రాజీవ్ కనకాల.