English | Telugu
Rashmika : తన ఫేక్ వీడియోపై స్పందిస్తూ ఎమోషనల్ అయిన రష్మిక!
Updated : Nov 6, 2023
రష్మిక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీపిపై అమితాబ్ బచ్చన్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన వీడియో వైరల్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకున్న రష్మిక ఎంతో ఆవేదన చెందుతోంది. దీనిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
‘నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతున్న విషయం గురించి మాట్లాడాలంటే ఎంతో బాధగా ఉంది. కానీ, ఈ విషయాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఎఐ టెక్నాలజీ గురించి తలుచుకుంటే భయం వేస్తోంది. ఇలాంటి టెక్నాలజీ వల్ల నేను ఒక్కదాన్నే కాదు, మనందరం ఎంతో ప్రమాదంలో ఉన్నామని అందరూ గుర్తించాలి. నేను ఒక నటిని, సెలబ్రిటీని. నాకు నా కుటుంబం, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషుల నుంచి ఏ విషయంలోనైనా మద్దతు, రక్షణ లభిస్తుంది. ఒకవేళ ఇలాంటి ఘటన నేను స్కూల్, కాలేజ్ రోజుల్లో జరిగి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో. ఈ సమస్య తీవ్రతరం కాకముందే అందరూ దీన్ని ఖండిరచాలి. మరి కొంతమంది ఈ టెక్నాలజీకి బలికాకముందే దీనిపై అందరూ స్పందించాలి. టెక్నాలజీ సాయంతో ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అన్నారు.
వైరల్ అవుతున్న రష్మిక వీడియో ఫేక్ అని అభిషేక్ అనే జర్నలిస్ట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. డీప్ ఫేక్ వీడియో విషయంలో భారత్‌లో కఠిన చట్టాలు, తీసుకోవాల్సిన చర్యల విషయంలో త్వరిత గతిన స్పందించాల్సిన ఉంది అన్నారు. వైరల్ అవుతున్న ఫేక్ వీడియోకి సంబంధించిన ఒరిజినల్ వీడియో కూడా తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఉన్నది బ్రిటిష్- ఇండియన్ అమ్మాయి జారా పటేల్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 4 లక్షలకు పైగా ఫాలోవల్స్ ఉన్నారు.