Read more!

English | Telugu

యన్ టి ఆర్ "శక్తి" శాటిలైట్ రైట్స్ 10 కోట్లు

యన్ టి ఆర్ "శక్తి" శాటిలైట్ రైట్స్ 10 కోట్లు చెపుతున్నారట. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్, ఎ 1 స్టార్ యన్ టి ఆర్ హీరోగా, నలక నడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం "శక్తి".

 

ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రంలో యన్ టి ఆర్ నాలుగు విభిన్నమైన గెటప్పుల్లో కనపడతారట. ఒకటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గా, మరొకటి రుద్ర గా, మరొకటి రాజుగా, మరొకటి శక్తిగా ఇలా యన్ టి ఆర్ నాలుగు విభిన్నమైన గెటప్పుల్లో కనపడతారట. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాంటి ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ 10 కోట్లు చెపుతున్నారట.

 

రికార్డులు క్రియేట్ చేసిన "మగధీర" చిత్రానికే శాటిలైట్ హక్కుల కోసం అయిదు కోట్లిచ్చారు. మరి ఈయన్ టి ఆర్ "శక్తి" చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ కోసం 10 కోట్లు ఇవ్వమంటే మరి శాటిలైట్ ఛానల్స్ వారు ఏమంటారో వేచి చూడాలి...! ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం మార్చ్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల కానుంది.