English | Telugu
ఆ ఇద్దరితో రానా... రాత్రంతా!
Updated : Dec 16, 2014
రానా అంటే... అచ్చంగా లవర్‌బోయే. తెరపై గంభీరమైన పాత్రల్లో కనిపించినా, తెర వెనుక మాత్రం రొమాంటిక్ పర్సనే. ఈ విషయం మరోసారి అర్థమైంది. ఆదివారం రానా పుట్టిన రోజు. ఆ రోజు తన స్నేహితులందరినీ పిలిచి ముంబైలో ఘనంగా పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి ముఖ్య అతిథి ఎవరో తెలుసా...? రానా మాజీ లవర్ బిపాసాబసు. ఈ ఇద్దరూ కలసి దమ్ మారో దమ్ సినిమాలో నటించారు. అప్పటి నుంచీ.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోంది. ఆ సినిమా తరవాత ఇద్దరూ బ్రేకప్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి బిపాసాని పిలిచి మరీ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో లక్ష్మీరాయ్ కూడా మెరిసింది. ఈ ఇద్దరితో రానా రాత్రంతా చిందులు వేస్తూ గడిపేశాడట. బిపాసాతో మరోసారి క్లోజ్‌గా ఉండడం చూసి బాలీవుడ్ మీడియా సైతం ముక్కున వేలేసుకొంది. రానాకి హీరోల్లోనూ స్నేహితులున్నారు. వాళ్లెవరినీ ఈ పార్టీకి ఆహ్వానించకుండా కేవలం భామలకు మాత్రమే వెల్‌కమ్ చెప్పాడంటే... రానాలో రొమాంటిక్ యాంగిల్ ఎంతుందో ఆలోచించండి..!!