English | Telugu

రామ్ చరణ్ సరసన పరుల్ యాదవ్

రామ్ చరణ్ సరసన పరుల్ యాదవ్ హీరోయిన్‍ గా నటించనుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారనే దాని మీద వివిధ ఊహాగానాలు నెలకొన్నాయి.

ఇటీవల జరిగిన సి.సి.యల్. మ్యాచ్ లో కర్ణాటక బుల్ డోజర్స్ తరపున ప్రోత్సహించటానికి వచ్చిన కన్నడ హీరోయిన్ పరుల్ యాదవ్ పలువురి దృష్టిని ఆకర్షించింది. అప్పుడే హీరో రామ్ చరణ్ దృష్టి కూడా పరుల్ యాదవ్ మీద పడినట్టుంది. దాంతో ఈ సినిమాలో పరుల్ యాదవ్ పేరుని తానే దర్శక, నిర్మాతలకు సజెస్ట్ చేసినట్లు సమాచారం.