English | Telugu

మోహన్ బాబు, రామ్ చరణ్ ల మధ్య విభేదాల్లేవ్

మోహన్ బాబు, రామ్ చరణ్ ల మధ్య విభేదాల్లేవ్ అని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న మీడియాకు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే ఈ మధ్య యన్ టి వి న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్ లో కలెక్షన్ కింగ్, పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబుకీ, యువ హీరో రామ్ చరణ్ కీ మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని రావటంతో మంచు లక్ష్మి మోహన్ బాబు, రామ్ చరణ్ ల మధ్య విభేదాల్లేవ్ అని మీడియాకు తెలియజేయటం జరిగింది.

మంచు లక్ష్మీ "నాన్నకీ రామ్ చరణ్ కీ మధ్య విభేదాలున్నాయని యన్ టి వి న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్ లో వేయటం చూసి నేను అది తప్పు అలామటి విభేదాలేవీ వాళ్ళిద్దరి మధ్య లేవని ఇలా చెప్పాల్సి వస్తోంది. నిజానికి రామ్ చరణ్ ని నాన్న ఎప్పుడూ ఒక స్నేహితుడిగా, ఒక కన్నబిడ్డగానే ట్రీట్ చేస్తారు తప్ప విభేదాలొచ్చేలా ఎన్నడూ ట్రీట్ చేయరు. అదే విధంగా రామ్ చరణ్ కూడా నాన్నని చాలా గౌరవిస్తాడు...విభేదాలున్నాయన్నది ఒక రూమర్. దయచేసి వాటిని నమ్మకండి" అని అన్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.