English | Telugu

రామ్ చ‌ర‌ణ్ ఆయ‌నే దిక్క‌ట‌!

మొత్తానికి రామ్‌చ‌ర‌ణ్ - శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ ఓకే అయిపోయింది. ఏమాయ చేశాడో గానీ ఓ అట్ట‌ర్ ఫ్లాప్ (ఆగ‌డు) ఇచ్చి కూడా... మెగా ఫ్యామిలీ చేత సినిమా ఓకే చేయించుకొన్నాడు శ్రీ‌నువైట్ల‌. ఈ విష‌యంలో శ్రీ‌నువైట్ల మాయాజాలం కంటే, చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర మ‌రో ఆప్ష‌న్ లేక‌పోవ‌డ‌మే అస‌లు కార‌ణంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే చ‌ర‌ణ్ కి ఇప్పుడు ఓ భారీ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కావాలి. ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్ రుద్దుకొన్న ఫ‌లితం గోవిందుడు అంద‌రివాడేలే సినిమాతో తెలిసొచ్చింది. కొన్నేళ్ల వ‌ర‌కూ ఫ్యామిలీ క‌థ‌ల జోలికి వెళ్ల‌డు. అంటే.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాత‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేద‌న్న‌మాట‌. అలాంటి సినిమాలు చేయాలంటే బోయ‌పాటి శ్రీ‌ను, రాజ‌మౌళి, వినాయ‌క్, పూరి జ‌గ‌న్నాథ్‌లే దిక్కు. బోయ‌పాటి క‌థ న‌చ్చ‌క ఆయ‌న్ని ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశాడు. ఇక రాజ‌మౌళి చెర్రీతో సినిమా చేసే ఛాన్స్ లేదు. పూరిని గుడ్డిగా న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఆయ‌న‌తో సినిమా చేద్దామ‌న్నా పూరి కమిట్స్ మెంట్స్ పూరికి ఉన్నాయి. వినాయ‌క్ అయితే మ‌రీ రొటీన్ కాంబినేష‌న్ అయిపోతుంది. అందుకే.. శ్రీ‌నువైట్లే దిక్క‌య్యాడు. చ‌ర‌ణ్ ఏదో శ్రీ‌నుకి ఫేవ‌ర్ చేస్తున్నాడ‌ని అంద‌రూ అనుకొంటున్నారు. కానీ శ్రీ‌ను లేక‌పోతే ఇప్పుడు చ‌ర‌ణ్‌కి సినిమానే లేదు. అదీ క‌థ‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.