English | Telugu

రామ్ చరణ్ పెళ్ళెప్పుడంటే...!

మెగాస్టార్ ఏకైక కుమారుడు, నటవారసుడు అయిన రామ్ చరణ్ తేజ పెళ్ళి తాలూకు నిశ్చితార్థం అదేనండీ ఎంగేజ్ మెంట్ ఉపాసనతో ఇటీవల జరిగింది. కానీ పెళ్ళెప్పుడన్నది ఇంకా నిర్ణయించలేదు. సినీవర్గాల అంచనా ప్రకారం రామ్ చరణ్ వచ్చే సంవత్సరం వివాహం చేసుకుంటాడని తెలుస్తూంది. దానికి వారు చెప్పే కారణాలు సబబుగానే ఉన్నాయి.

రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో "రచ్చ" సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించటానికి అంగీకరించాడు. మురగదాస్ దర్శకత్వంలో కూడా హీరోగా నటించేందుకు రామ్ చరణ్ అంగీకరించాడని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. ఈ మూడు సినిమాలు పూర్తయ్యాకే తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సినీజనం అనుకుంటున్నారు...! అయితే ఇది ఎంతవరకూ నిజమన్నది తెలియాల్సి ఉంది.