English | Telugu
ఇక మిగిలింది రామ్ చరణ్ మాత్రమే
Updated : Nov 10, 2023
రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ దీపావళికి సాంగ్ రిలీజ్ అయ్యి తమకి ఈ దీపావళి డబుల్ ఆనందాన్ని తీసుకు రావడం ఖాయమని మెగా ఫాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పడు గేమ్ చేంజర్ మూవీ నుంచి వస్తున్న తాజా అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
దీపావళి ముందురోజు కానీ లేదా దీపావళి రోజున కానీ గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి అనే సాంగ్ రిలీజ్ కాబోతుందని అందరు అనుకున్నారు. ఈ సాంగ్ కోసం మెగా అభిమానులతో పాటు సాధారణ సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా శంకర్ సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా ఒక విజువల్ వండర్ ని కలిగిస్తాయి. స్క్రీన్ మీద ఆ పాటలని చూడటానికి రెండు కళ్ళు చాలవు. అంతలా శంకర్ తన పాటలని తెరకెక్కిస్తాడు. తమ అభిమాన హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో శంకర్ విజువల్స్ కి తన ప్రెజెంటేషన్ ని ఎలా ఇచ్చాడో అని మెగా ఫాన్స్ లో చిన్న ఉత్సుకత ఉంది.కానీ ఇప్పుడు దీపావళికి సాంగ్ రావడంలేదనే వార్తలతో మెగా ఫాన్స్ డీలా పడతారని చెప్పవచ్చు
ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం మూవీ నుంచి దం మసాలా సాంగ్ వచ్చి తెలుగు నాట మోతమోగిపోతుంది. మరి ఇపుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. రాబోయే రోజుల్లో జరగండి సాంగ్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుండగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.