English | Telugu

మందు పార్టీపై రామ్ చరణ్ క్లారిటీ

తన ఇంట్లో జరిగిన విందులో అరుపులు, కేకలతో ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగించినట్లు వచ్చిన వార్తలపై ప్రముఖ హీరో రాంచరణ్ తేజ స్పందించారు. శనివారం రాత్రి మా ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ మాత్రమే చేశాం. ఇరుగు పొరుగు వారికి నేను ఎలాంటి ఇబ్బంది కలిగించను. వారి ఏకాగ్రతకు భంగం కలిగేలా ప్రవర్తించను. పక్కింటి వారికి అసౌకర్యం కలిగించినట్లు వచ్చిన వార్తలు అసత్యమని రాంచరణ్ కొట్టిపారేశారు. అయితే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ : 25లో స్నేహితులకు ఇచ్చిన విందు వివాదం రేపింది. ఇందులో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుమారుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీళ్ల అరుపులు కేకలకు పక్కనే ఉన్న సీనియర్ ఐపీఎస్ గౌతం సవాంగ్ విని ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి చెప్పినా రాంచరణ్ పట్టించుకోలేదని సమాచారం వచ్చింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.