English | Telugu

జూనియ‌ర్ ముందు ఎన్టీఆర్ జీరో అట‌!

హ‌మ్మా... రాంగోపాల్ వ‌ర్మ ఎంత మాట‌న్నాడు! ఎవ‌రిని ఎవ‌రితో పోల‌చ్చాడు..?
వ‌ర్మ పిచ్చి.. హైపిచ్‌లోకి వెళ్లిన‌ప్పుడ‌ల్లా ఎవ‌రినో ఒక‌రిని టార్గెట్ చేస్తూ.. కామెంట్లు విసురుతుంటాడు. అందులో కావ‌ల్సినంత ఫ‌న్ను దొరుకుతుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేసీఆర్‌, చిరంజీవి, మ‌హేష్ బాబు... ఇలా ఎవ్వ‌రినీ వ‌ద‌ల్లేదాయ‌న‌. పొగిడినా.. తిట్టిన‌ట్టే.. తిట్టినా పొగిడిన‌ట్టే అనిపించేలా మాట్లాడ‌డం వ‌ర్మ‌కే చెల్లు. ఇప్పుడు జూనియ‌ర్ పై బాణం విసిరాడు వ‌ర్మ‌. అది అలాంటిలాంటి బాణం కాదు. నేరుగా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యేలాంటి బాణం.

టెంప‌ర్ సినిమా వ‌స్తోంది క‌దా..? అంద‌రూ ఎన్టీఆర్ గురించి మాట్లాడ‌తారు. అందుకే వ‌ర్మ కూడా మాట్లాడాడు... కాక‌పోతే కాస్త అతిగా. టెంప‌ర్‌లో ఎన్టీఆర్ న‌ట‌న అద్భుత‌మూ, అమోఘ‌మ‌ట‌. అంత‌వర‌కూ బాగానే ఉంది. అయితే ఈ జూనియ‌ర్ న‌ట‌న ముందు పెద్దాయ‌న నంద‌మూరి తార‌క రామారావు. ఎందుకూ ప‌నికి రాడ‌ట‌. 50 ఏళ్ల ఎన్టీఆర్ కెరీర్‌లో టెంప‌ర్‌తో పోల్చి చూడ‌ద‌గిన సినిమా ఒక్క‌టీ లేద‌ట‌. అడ‌వి రాముడు 17 సార్లు చూశా... టెంప‌ర్ 27సార్లు చూస్తా అంటున్నాడు వ‌ర్మ‌. అంతేకాదు.. ఇక నుంచి ఎన్టీఆర్ వంశంలో ఎవ‌రు పుట్టినా జూనియ‌ర్ పేరుతోనే పాపుల‌ర్ అవుతార‌ట‌. టీడీపీ ఆఫీసుల్లో ఎన్టీఆర్ ఫొటో తీసి జూనియ‌ర్ ఫొటో పెట్టుకోమ‌ని స‌ల‌హా కూడా ఇస్తున్నాడు. ఇదంతా పైత్యానికి ప‌రాకాష్ట కాక‌పోతే మ‌రేంటి?? ట‌్విట్ట‌ర్ ఒక‌టి ఉంది క‌దా అని ఏదిప‌డితే అది రాసేస్తే ఎలా..?? వ‌ర్మా.. ఇలా ఎంత‌కాలం, జ‌నాలు న‌వ్వుకొంటున్నారు. ఆ మాట‌కొస్తే.. ఇలాంటి కామెంట్లు జూనియ‌రే ప‌ట్టించుకోడు. ఇలాంటి పిచ్చిపిచ్చి పోలిక‌లు ఆపేసి... త‌న సినిమా గొడ‌వేదో తాను చూసుకొంటే మంచిది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.