English | Telugu

ఎన్టీఆర్ - మ‌ధురిమ గొడ‌వ‌... పూరి క్లారిటీ

టెంప‌ర్ సెట్లో ఎన్టీఆర్ - మ‌ధురిమ గొడ‌వ ప‌డ్డారా..??? మ‌ధురిమ న‌ట‌న‌పై ఎన్టీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడా.. అందుకు మ‌ధురిమ అలిగి సెట్లోంచి వెళ్లిపోయిందా..?? ఒక‌ట్రెండు రోజుల నుంచీ ఈ త‌ర‌హా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌ధురిమ‌కీ టెంప‌ర్ యూనిట్ మ‌ధ్య ఏదో జ‌రిగింద‌న్న గుస‌గుస‌లు ఎక్క‌వ‌య్యాయి. వీటిపై పూరి జ‌గ‌న్నాథ్ క్లారిటీ ఇచ్చాడు. ``మ‌ధురిమ, ఎన్టీఆర్‌ల గొడ‌వ ఉత్తిదే. ఎవ‌రో కావాల‌ని పుట్టించిన పుకారు. మ‌ధురిమ చాలా బాగా న‌టించింది. ఆమె కెరీర్ బాగుండాల‌ని అంద‌రూ కోరుకొంటున్నాం. ఎన్టీఆర్ డ‌బ్బుల కోసం డ‌బ్బింగ్ చెప్ప‌లేద‌న్న విష‌యం కూడా వాస్త‌వం కాదు. టెంప‌ర్ పై వ‌స్తున్న ఇలాంటి పుకార్లు న‌మ్మొద్దు`` అంటున్నాడు పూరి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.