English | Telugu

రామ్ చరణ్, ఉపాసన కి కవల పిల్లలు అంట 

రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్ అంటూ ఉపాసన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఉపాసన సీమంతం వేడుకకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఉపాసనను ఆశీర్వదించారు. అందులో వెంకటేష్, నాగార్జున, నయనతార వంటి స్టార్స్ ఉన్నారు.

ఇక రామ్ చరణ్, ఉపాసనకి కవల పిల్లలు పుట్టబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగానే ధ్రువీకరించారు. చరణ్, ఉపాసన వివాహం 2012 లో జరిగింది. 2023 లో వీరికి పాప పుట్టింది. పాప పేరు క్లీంకార. ఇప్పుడు బాబు పుడితే బాగుంటుందని, మెగా వారసుడు వచ్చినట్టు అవుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. చిరంజీవి (Chiranjeevi) కోరిక కూడా అదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందరూ మనవరాళ్లే అయ్యారని, ఓ మనవడు ఉంటే బాగుంటుందని గతంలో ఒక ఈవెంట్ లో చిరంజీవి తన మనసులోని మాట బయటపెట్టారు. మరి ఇప్పుడు కవల పిల్లలు పుట్టబోతున్నారు కాబట్టి, చిరంజీవి కోరుకున్నట్టుగా ఒక మనవడా, లేక ఇద్దరు మనవళ్ళా, లేక కవలలో ఎవరు పుడతారనే చర్చ అభిమానుల్లో జరుగుతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.