English | Telugu

Akhanda 2 Teaser: మరి కాసేపట్లో రిలీజ్ అయ్యే అఖండ 2 టీజర్ హైలెట్స్ ఇవే 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)సిల్వర్ స్క్రీన్ పై పోషించిన క్యారెక్టర్స్ మరో హీరో పోషించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాన్నీ చాలా మంది హీరోలు బహిరంగంగానే చెప్తుంటారు. సాంఘిక, పౌరాణిక, జానపద, ఫిక్షన్, ఫ్యాక్షన్, డేవోషనల్ కి సంబంధించిన చిత్రాల ద్వారా ఆయా క్యారెక్టర్స్ ని అద్భుతంగా పోషిస్తు అభిమానులు,ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నాడు. అసలు బాలకృష్ణ ఒక క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసాడంటే సదరు క్యారక్టర్ మన మనస్సులో నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంత చరిష్మా బాలకృష్ణ సొంతం.

బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ పార్ట్ 2'(Akhanda 2)తో బిజీగా ఉన్నాడు. అఖండ కి సీక్వెల్ కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)ఇంకా అధికారంగా చెప్పకపోయినా పార్ట్ 2 లో బాలకృష డ్యూయల్ రోల్ అనేది గ్యారంటీ. మొదటి భాగం ఎండింగ్ లో అఘోర క్యారక్టర్ తో పాటు సోషల్ సర్వీస్ చేసే మరో క్యారక్టర్ కూడా ఉంది. దీంతో డ్యూయల్ రోల్ ఉండటం అనేది పక్కా. బాలకృష్ణ, బోయపాటి కి ఉన్నట్రాక్ రికార్డు కూడా అలాంటిందే. రీసెంట్ గా ఫిలిం సర్కిల్స్ లో సోషల్ సర్వీస్ చేసే క్యారక్టర్ ని హిందూపురం ఎంఎల్ఏ గా చూపించబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు. ఎందుకంటే మొదటి భాగంలో బాలకృష అనంతపురంలోనే ఉంటాడు. పైగా పేద ప్రజలని అండగా ఉంటు సంఘ విద్రోహ శక్తుల అంతు చూస్తుంటాడు. కాబట్టి ఆ క్యారక్టర్ ని అనంతపురం జిల్లాలోనే ఉన్న హిందుపురం ఎంఎల్ఏ గా మార్చడం పెద్ద విషయమేమి కాదు.

ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రియల్ లైఫ్ లో బాలకృష్ణ గత మూడు పర్యాయాల నుంచి హిందూపురం ఎంఎల్ఏ గా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఫస్ట్ టైం మా బాలయ్య నిజజీవిత పాత్రని పోషిస్తున్నాడని, సిల్వర్ స్క్రీన్ పై ఆ మూమెంట్ సంచలనం సృష్టించడం ఖాయమనే కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి రిలీజ్ కాబోయే టీజర్ లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ టీజర్ లో అఘోర గురించి కాకుండా రెండో క్యారక్టర్ గురించే చెప్పనున్నారు. అఖండ పార్ట్ 2 డిసెంబర్ 5 న పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .