English | Telugu
హాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడుతున్న 'ఆర్ఆర్ఆర్' స్టార్స్
Updated : Feb 23, 2023
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. 'ఆర్ఆర్ఆర్' లోని 'నాటు నాటు' సాంగ్ ఏకంగా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. తాజాగా 'ఆర్ఆర్ఆర్' మరో ప్రతిష్టాత్మక అవార్డుల్లో నామినేషన్స్ దక్కించుకుంది.
హాలీవుడ్ కి చెందిన క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్షన్ మూవీ విభాగంలో 'ఆర్ఆర్ఆర్' నామినేషన్ దక్కించుకుంది. అలాగే బెస్ట్ యాక్టర్ విభాగంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ నామినేషన్స్ లో నిలిచారు. టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ వంటి హాలీవుడ్ స్టార్స్ సరసన ఎన్టీఆర్, రామ్ చరణ్ నిలవడం విశేషం. ఈ అవార్డుల ఫలితాలు మార్చి 16న తెలుస్తాయి. మరి ఈ అవార్డుల్లో గెలిచి ఆర్ఆర్ఆర్ టీమ్ సత్తా చాటుతుందేమో చూడాలి.