English | Telugu

మాథియాస్‌తో తొమ్మిదేళ్ల రిలేష‌న్‌షిప్ గురించి చెప్పిన తాప్సీ

ప్ర‌ముఖ ప్యాన్ ఇండియ‌న్ యాక్ట్రెస్ తాప్సీ ప‌న్ను. మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టి తాప్సీ. ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మాథియాస్ బోతో ఆమె తొమ్మిదేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న రిలేష‌న్‌షిప్ గురించి మాట్లాడారు తాప్సీ. `` చాలా మంది నా కాంటెంప‌ర‌రీస్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పిల్ల‌ల్ని కంటున్నారు. జీవితంలో సెటిల్ అవుతున్నారు. కానీ, నేను డేటింగ్ మొద‌లుపెట్టిన వ్య‌క్తితోనే ఇంకా డేట్‌లో ఉన్నా. నా కెరీర్ ఎర్లీ స్టేజ్‌లోనే నేను త‌న‌కి క‌నెక్ట్ అయ్యాను. దాదాపు తొమ్మిదేళ్లుగా నేను అత‌నితో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాను. ఇలా ఉండ‌టం చాలా బావుంది. నేనెప్పుడూ ఎవ‌రితోనూ పోటీప‌డ‌ను. అది వ‌ర్క్ విష‌యంలో అయినా, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో అయినా. నా జీవితం ఇలాగే బావుంది. కాంటెంప‌ర‌రీస్ అంద‌రూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు క‌దా అని నేను చేసుకోద‌ల‌చుకోవ‌డం లేదు`` అని అన్నారు.

త‌మ గురించి చెబుతూ ``మేమిద్ద‌రం ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీగా ఉన్నాం. సాయంత్రానికి ఒక‌రికోసం ఒక‌రు స‌మ‌యాన్ని కేటాయించుకోగ‌లుగుతున్నాం. ఒక‌రి గురించి ఒక‌రికి తెలియ‌న‌ట్టు న‌టించ‌డం లేదు. బాహ్య ప్ర‌పంచానికి మేమిద్ద‌రం ఒక‌రికోసం ఒక‌రం ఉన్నామ‌ని ధైర్యంగా చెప్పుకోగ‌లుగుతున్నాం. ఇంత గొప్ప అనుబంధం మా మ‌ధ్య ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను`` అని అన్నారు.

తాప్సీ ప్ర‌స్తుతం లూప్ ల‌పేటాలో న‌టిస్తున్నారు. తాహిర్ రాజ్ భాసిన్ ఇందులో లీడ్ కేర‌క్ట‌ర్ చేస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.షారుఖ్ ఖాన్‌తో డంకీలో న‌టిస్తున్నారు తాప్సీ. ఇందులో కామెడీ రోల్ చేస్తున్నారు. వో ల‌డ్కీ హై క‌హాలోనూ కామెడీ రోల్ పోషిస్తున్నారు తాప్సీ. దొబారాలో త‌న రోల్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటార‌న్న‌ది తాప్సీ చెబుతున్న మాట‌.