English | Telugu
అల్లరోడితో చేయట్లేదంట...!
Updated : Feb 25, 2014
అల్లరి నరేష్ హీరోగా వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా రకూల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయినట్లుగా గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమే అని రకూల్ తెలిపింది. రకూల్ ట్విట్టర్ ద్వారా... "నేను నా తర్వాత సినిమా మనోజ్ తో చేస్తున్నాను. ఇది కాకుండా వేరే సినిమాను ఇంకా అంగీకరించలేదు. ఈ మధ్య నా సినిమా గురించి వస్తున్న రూమర్స్ చదివాను. అందుకే క్లారిఫై చేస్తున్నాను" అంటూ పోస్ట్ చేసింది.