English | Telugu
అల్లరోడితో సందీప్ హీరోయిన్
Updated : Feb 22, 2014
"వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. ఇటీవలే మనోజ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసిన ఈ అమ్మడు తాజాగా మరో సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. అల్లరి నరేష్ హీరోగా వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో హీరోయిన్ గా రకూల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ రెండు సినిమాలు ఈ భామకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో త్వరలోనే తెలియనుంది.