English | Telugu

కాంతార ప్రీక్వెల్‌కి ర‌జ‌నీ య‌స్ చెప్పేసిన‌ట్టేనా?

రిష‌బ్ శెట్టి హీరోగా మెప్పించిన డివైన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ కాంతార‌. గ‌తేడాది 16 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మిత‌మై 400 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి, అంద‌రి చేతా వావ్ అనిపించుకుంది. ఆస్కార్ రేసులో కూడా ఉంటుంద‌నే మాట‌లొచ్చాయి. అయితే ప్ర‌మోష‌న్‌కి స‌రైన స‌మ‌యం లేక‌పోవ‌డంతో ఈ సారి కాంతార విష‌యంలో రాజీప‌డ్డ‌ట్టు హోంబ‌లే ఫిల్మ్స్ అధినేత కూడా అన్నారు. అయితే కాంతార ప్రీక్వెల్ విష‌యంలో అస‌లు త‌గ్గేదేలేద‌ని చెప్పారు. కాంతార‌ ప్రీక్వెల్‌లో ర‌జ‌నీకాంత్ న‌టిస్తార‌నే వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్ప‌టిదాకా దాని గురించి మాత్రం ర‌జ‌నీకాంత్ నోరు విప్ప‌లేదు. ఆయ‌న ప్ర‌స్తుతం జైల‌ర్ ప‌నుల‌తో బిజీగా ఉన్నారు.

మ‌రోవైపు కుమార్తె ఐశ్వ‌ర్య తెర‌కెక్కిస్తున్న సినిమాలో న‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంతార ప్రీక్వెల్ గురించి మాత్రం నోరు విప్ప‌లేదు ర‌జ‌నీకాంత్‌. ప్ర‌స్తుతం రిష‌బ్ శెట్టి కూడా కాంతార ప్రీక్వెల్‌కి స్క్రిప్టింగ్ ప‌నుల్లో ఉన్నార‌ట‌. గ‌త మూవీతో పోలిస్తే, ఈ సినిమాను ప‌ర్యావ‌ర‌ణానికి మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉండేలా తీర్చిదిద్దాల‌న్న‌ది రిష‌బ్ శెట్టి ప్లాన్‌. అర‌ణ్యంలో నివ‌సించే వారి జీవ‌న‌విధానం, హ‌క్కులు, వారి భావోద్వేగాలు, మాన‌సిక ప‌రిస్థితి, ప్ర‌భుత్వాలు వారికి విధిస్తున్న ఆంక్ష‌లు, కురిపిస్తున్న కానుక‌లు, అవి వారికి చేరే విధానం వంటి విష‌యాల మీద పరిశీలిస్తున్నార‌ట రిష‌బ్‌. ఒక్క‌సారి స్క్రిప్ట్ పూర్త‌యితే లొకేష‌న్ల వేట మొద‌లుపెట్టాల‌న్న‌ది రిష‌బ్ ప్లాన్‌. ఇప్ప‌టికే స్క్రిప్టింగ్ ప‌నులు పూర్తి కావాల్సింది. కాక‌పోతే, ఇటీవ‌ల ఐక్య‌రాజ్య‌స‌మితిలో కాంతార‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆ సినిమా కోసం జెనోవా వెళ్లారు రిష‌బ్‌. దాంతో స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఆగిపోయింది అని అంటున్నారు హోంబ‌లే సంస్థ వెల్‌విష‌ర్స్. విజ‌య్ కిర‌గందూర్‌, చ‌లువె గౌడ నిర్మిస్తున్న సినిమా ఇది. స‌ప్త‌మి గౌడ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కిషోర్ కుమార్ కేర‌క్ట‌ర్ కూడా సినిమాకు కీల‌కం.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...