English | Telugu

రజనీకాంత్ బాగున్నారు

రజనీకాంత్ బాగున్నారు అని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే ఆ మధ్య విచిత్రంగా రజనీ కాంత్ హీరోగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మించబడుతున్న "రాణా" చిత్రం ప్రారంభోత్సవం నాడే రజనీకాంత్ అనారోగ్యనికి లోనయ్యారు. ఆయన్ని మైలాపూర్ లో ఉన్న ఇసబిల్లా హాస్పిటల్లో చేర్చారు. చేరిన మరుసటి రోజే రజనీ కాంత్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన అనారోగ్యంపాలు కావటంతో ఆయన్ని అదే హాస్పిటల్లో చేర్చారు. రెండురోజుల తర్వాత ఆయన్ని హాస్పిటల్‍ నుండి డిశ్చార్జి చేశారు.

అనంతరం ఆయనకు ఊపిరి తిత్తులలో ఇన్ ఫెక్షన్ రావటంతో, శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతూండటం వల్ల ఆయన్ని ఈసారి రామచంద్ర హాస్పిటల్లో జాయిన్ చేశారు. రజనీ కాంత్ ఇన్నిసార్లు హాస్పిటల్లో చేరటం వల్ల కొన్ని రూమర్లు కూడా వ్యాపించాయి. కొందరైతే ఏకంగా రజనీ కాంత్ చనిపోయారని కూడా రూమర్ ని వ్యాపింప జేయటంతో, రజనీ కాంత్ కుటుంబ సభ్యులు "రజనీ కాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయనకేం కాలేదని "వివరణ ఇస్తూ మీడియా ముందుకు రావలసి వచ్చింది. రజనీ కాంత్ భార్య లత, ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, పెద్దల్లుడు ప్రముఖ తమిళ యువ హీరో అయిన ధనుష్ కలసి రజని కాంత్ ఆరోగ్యం గురించి మీడియాకు వివరణ ఇచ్చారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.